Header Banner

ఆగని వైసీపీ అరాచకాలు.. రౌడీగా రెచ్చిపోయిన మాజీ ఎమ్మెల్యే! ట్రావెల్స్ కండక్టర్‌పై దాడి!

  Thu May 15, 2025 20:24        Politics

వైసీపీ అధికారాన్ని కోల్పోయినా.. ఆ పార్టీ నేతలు మాత్రం దుందుడుకు వైఖరిని వీడడం లేదు. ఇప్పటికే ఆ పార్టీలోని పలువురు కీలక నేతలపై వివిధ పోలీస్ స్టేషనలలో కేసులు నమోదయ్యాయి. అయితే వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా రెచ్చిపోయారు. తన బస్సు కంటే ముందే వెళ్తారా అంటూ..మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కండక్టర్ హరినాథ్‌పై దాడి చేశాడు.

గురువారం మదనపల్లి పట్టణంలో బెంగళూరు బస్టాండ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడితో తీవ్రంగా గాయపడిన హరినాథ్‌ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా తీరుపై కుటుంబ సభ్యులు, స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అతడిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్కామ్‌లపై కూటమి ప్రభుత్వం విచారణ జరుపుతోంది. అలాగే పలువురు నాయకులపై సైతం కేసులు నమోదయ్యాయి. అందులోభాగంగా వారంతా విచారణను ఎదుర్కొంటున్నారు. అలాంటి వేళ.. ఇలా మదనపల్లికి చెందిన నవాజ్ బాషా.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కండక్టర్‌పై దాడి చేయడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల నుంచి సరిహద్దులుగా గల రాష్ట్రాలకు ప్రతి రోజు వందల సంఖ్యలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడుస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆయా ట్రావెల్స్ మధ్య ఓ విధమైన పోటీ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.


ఇది కూడా చదవండితల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!

వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!

సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!

కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!


చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #YCPRowdyism #FormerMLAAttack #TravelsConductorAssault #NawazBasha #PoliticalViolence #AndhraPolitics